schedule Saturday, July 04, 2026

'సారా'క్షసీపై దాడులు..!

calendar_today June 29, 2024
person dharshininews
'సారా'క్షసీపై దాడులు..!
chai jr 'సారా'క్షసీపై దాడులు..! - బెల్లం పానకం ధ్వంసం - ముగ్గురు తయారిదారులపై కేసు -వెల్లడించిన తాండూరు ఎక్సైజ్ పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జీవీతాలను నాశనం చేసే సారా రాక్షసిపై తాండూరు ఎక్సైజ్ పోలీసులు జులం విధిలించారు. గుట్టు సాగిస్తున్న తయారి కేంద్రాలపై దాడులు నిర్వహించారు. సారా తయారికి వినియోగించే పానకాన్ని ధ్వసం చేశారు. ఇందుకు సంబంధించి తాండూరు ఎక్సైజ్ సీఐ బాలగంగాదర్ శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వికారాబాద్‌ ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ జీవన్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం పాషాపూర్ తాండా, రాంసింగ్ తాండా, ఓమ్లా నాయక్ తాండాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారాకు వినియోగించే 600ల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా పానకం నిల్వ ఉంచిన పాషాపూర్ తాండాకు చెందిన రాథోడ్ రాములు, కిషన్, ఓమ్లానాయక్ తాండాకు చెందిన రాథోడ్ సుభాష్‌లపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ నిషేధిత నాటు సారాను తయారు చేసినా, విక్రయించిన జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సారా రాక్షసిని నిర్మూలించేందుకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల్లో రంగారెడ్డి జోన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్, డీటీఎఫ్‌ వికారాబాద్, వికారాబాద్, తాండూరు ఎక్సైజ్ సీఐల బృందాలు పాల్గొన్నాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27488/