schedule Thursday, September 10, 2026

బాలికతో బ్యాడ్‌ చాటింగ్..!

calendar_today June 28, 2024
person dharshininews
బాలికతో బ్యాడ్‌ చాటింగ్..!
chai jrబాలికతో బ్యాడ్‌ చాటింగ్..! - రాంగ్‌ కాల్ ర్యాంగిగ్‌కు కరణ్‌ కోట్ పోలీసుల కళ్లెం - నెల్లూరుడోని జైలుకు పంపిన పోలీసులు - తాండూరు మండలంలో ఘటన - వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు మైనర్ బాలికతో అసభ్యకర చాటింగ్ చేసి జైలు పాలు అయ్యాడు. తాండూరు మండలంకు చెందిన బాలికను వేధించిన యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరుకు చెందినట్లుగా పోలీసులు గుర్తించి అరదండాలతో కళ్లెం వేశారు.. శుక్రవారం కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. గత కొన్నినెలల క్రితం తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ (17) బాలిక తన స్నేహితురాలికి ఫోన్ చేయగా ఒక నెంబర్ మిస్టేక్ట్ తో ఆంధ్రాలోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ కు కనెక్ట్ అయ్యింది. దీంతో శ్రీనివాస్ అప్పటి నుంచి అమ్మాయికి మాయమాటలు చెపుతూ స్నేహం పెంచుకున్నాడు. వాట్సాప్, ఇన్ స్ట్రా గ్రాంలలో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఇటీవల అమ్మాయితో అసభ్యకరంగా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ ఫోన్ నెంబర్ ఆధారంగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు నుంచి కరణ్ కోట్ పోలీస్టేషన్ కు తీసుకవచ్చారు. మైనర్ బాలికను వేధించిన ఫిర్యాదు మేరకు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27467/