schedule Thursday, September 10, 2026

అక్రమంగా ఇసుక రవాణ

calendar_today June 24, 2024
person dharshininews
అక్రమంగా ఇసుక రవాణ
chai jrఅక్రమంగా ఇసుక రవాణ - రెండు ట్రాక్టర్ల సీజ్‌, డ్రైవర్లపై కేసు - కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కరణ్ కోట్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. సోమవారం తెల్లవారు జాము 4గంటల ప్రాంతంలో తాండూరు మండలం చెన్ గెష్ పూర్ గ్రామ పరిధిలో ఇసుక రవాణా జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది. ఈ మేరకు దాడులు చేయగా వీర్ శెట్టిపల్లి గ్రామానికి చెందిన జీ.నర్సింలు ట్రాక్టర్(టీఎస్ 34 ఈ4030)లో, యాలాల నరేష్ అనే వ్యక్తి మరో ట్రాక్టర్(టీఎస్ 34 ఎసీఆర్ 8430, ట్రాలీ నెంబర్ టీఎస్ 34 టీఏ 6607)లో అనుమతులు లేకుండా కాగ్నానది నుంచి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27373/