schedule Saturday, September 05, 2026

ఫ్రౌడ్‌.. ఫాదర్..!

calendar_today June 16, 2024
person dharshininews
ఫ్రౌడ్‌.. ఫాదర్..!
chai jr ఫ్రౌడ్‌.. ఫాదర్..! - ఐఏఎస్‌ కుమార్తెకు తండ్రి సెల్యూట్‌ - పోలీసు ఉన్నతాధికారికి దక్కిన గౌరవం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఆ తండ్రి పోలీసు శాఖలో ఉన్నతాధికారి. అయినా తనకన్న ఉన్నస్థాయిలో ఐఏఎస్ సాధించిన కుమార్తెకు సెల్యూట్‌ చేస్తే ఎంతో ఫ్రౌడ్‌గా ఫీలవుతారు. అలాంటి సందర్భం వికారాబాద్‌ జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేసిన ఉమా హారతి తండ్రికి దక్కింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు కూతురు ఉమాహరతి సివిల్స్-2022లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో ఆవిష్కృతమైంది. ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శిక్షణలో భాగంగా శనివారం ఆర్‌బీవీఆర్‌ఆర్‌ రాష్ట్ర పోలీసు అకాడమీని సందర్శించారు. ఈ బృందంలోని ఉమాహారతికి ఆమె తండ్రి, పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడికి ఐఏఎస్ స్థాయిలో వచ్చిన ఉమా హారతికి తండ్రి వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి సరదాగా సెల్యూట్‌ చేశారు. ఆదివారం ఫాదర్స్‌ డే జరుపుకొంటున్న తరుణంలో ఒక రోజు ముందు ఈ ఘటన జరగడం విశేషం. తండ్రి కూతురికి సెల్యూట్ చేసే దృశ్యం అందరిని కదిలించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. https://www.dharshininews.com/27177/