schedule Saturday, September 05, 2026

కేంద్రంలో మంత్రుల శాఖలు కేటాయింపు

calendar_today June 10, 2024
person dharshininews
కేంద్రంలో మంత్రుల శాఖలు కేటాయింపు
chai jr కేంద్రంలో మంత్రుల శాఖలు కేటాయింపు - తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ - ఆంధ్రా నుంచి రామ్మోహన్, చంద్రశేఖర్‌లకు చాన్స్ దర్శిని ప్రతినిధి : కేంద్రప్రభుత్వంలో తెలంగాణ, ఆంధ్రా మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. బీజేపీ ప్రభుత్వంలో కీలక శాఖలను దక్కించుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రి పదవి, రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్‌, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను అప్పగించగా... గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చారు. నరసరావు పేట ఎంపీ శ్రీనివాస వర్మకు స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి పదవి ఇచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27105/