schedule Friday, September 11, 2026

అటు.. ఇటూ.. చూసీ..!

calendar_today May 31, 2024
person dharshininews
అటు.. ఇటూ.. చూసీ..!
chai jrఅటు.. ఇటూ.. చూసీ..! - బైకును దొబ్బేసిన దొంగ - సీసీ పుటేజీలో చోరీ రికార్డు - పోలీసులకు బాధితుడి ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి: దొంగతనాలు చేసే దొంగలకు సీజన్‌ అంటూ ఏమీ ఉండదు. కాస్తా టైం దొరికిన కన్నేసిన దానిని చక్కబెట్టేస్తారు. అర్దరాత్రుళ్లు అయితే వారి చేతివాటం బ్రహ్మండగా పనిచేస్తుంది. ఇలా అర్దరాత్రి వేళ ఓ దొంగ బైకును దొబ్బేశాడు. అటూ ఇటూ చూసి దోచిన బైకుపై రాజాలా వెళ్లిపోయాడు. తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ సంఘటన ఆలస్యంగా వచ్చింది. బైకు దొంగతనం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని పసారి వార్డుకు చెందిన శివప్రసాద్ అనే వ్యక్తి తన ద్విచక్ర (ఏపీ24 డిఎస్ 4341) వాహనాన్ని ఇంటి బయట పార్క్ చేశాడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అటూ.. ఇటూ చూశాడు. ఎవ్వరు లేకపోవడంతో బైకును గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళ్లాడు. స్టైల్‌గా బైకుపై వెళ్లిపోయాడు. సీసీ పుటేజీలను చూసిన కుటుంభీకులు ఆశ్చర్యానికి గురయ్యారు. బాధితుడు తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి సీసీ పుటేజీ ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26885/