schedule Friday, September 11, 2026

రెండు భైకులు ఢీ..!

calendar_today May 29, 2024
person dharshininews
రెండు భైకులు ఢీ..!
రెండు భైకులు ఢీ..! - ప్రమాదంలో రేషన్ డీలర్ దుర్మరణం - కోడంగల్‌ నియోజకవర్గంలో ప్రమాదం - మృతుడు తాండూరు వాసి తాండూరు, దర్శిని ప్రతినిధి : రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ రేషన్ డీలర్‌ దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనలో మృతుని భార్యకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కోడంగల్ నియోజకవర్గంలో జరగగా మృతుడు తాండూరు పట్టణ వాసిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణానికి చెందిన కోట్రిక వీరేశం(50) తన భార్య సుజాత పేరుతో ఉన్న రేషన్‌ డీలర్‌ పనిచేస్తున్నాడు. బుధవారం భార్యతో కలిసి నారాయణపేట్‌ నుంచి కోడంగల్ మీదుగా తాండూరు వైపు వస్తున్నాడు. మార్గమద్యలోని చిన్న నందిగామ గేటు వద్ద వీరేశం బైకుతో పాటు ఎదురుగా వస్తున్న మరో బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వీరేశం అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య కాలు విరిగి తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ సంఘటనపై తాండూరు రేషన్ డీలర్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి...   https://www.dharshininews.com/26850/