schedule Thursday, September 03, 2026

మందు బాబులకు బ్యాడ్ న్యూస్..!

calendar_today May 10, 2024
person dharshininews
మందు బాబులకు బ్యాడ్ న్యూస్..!
మందు బాబులకు బ్యాడ్ న్యూస్..! - మూడు రోజులు వైన్స్‌ షాపులు బంద్‌ - ఎన్నికల కమీషన్ కీలక ఆదేశాలు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఎన్నికల కమీషన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్‌ షాపు బంద్‌ పాటించాలని కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను 3 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. దీంతో ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి 13 సాయంత్రం వరకు మూతబడనున్నాయి. ఈ మే 12, మే13 రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలకు ఇప్పటికే మందు బాబులు బీర్లు తెగతాగేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మూడు రోజులు వైన్స్‌ షాపులు బంద్ అవుతాయని తెలియడంతో టెన్షన్‌ పడుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26336/