schedule Thursday, September 10, 2026

తాండూరులో జింక మాంసం..!

calendar_today April 30, 2024
person dharshininews
తాండూరులో జింక మాంసం..!
తాండూరులో జింక మాంసం..! - ఆజ్ఞాత వ్యక్తి సమాచారంతో హైరానా - తనిఖీలు చేపట్టిన పోలీసులు - చివరకు అధికారులు ఏం తేల్చారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఓ వ్యక్తి జింక మాంసం కలిగి ఉన్నట్లు ఆజ్ఞాత వ్యక్తి అందించిన సమాచారం ప్రభుత్వ శాఖ అధికారులను హైరానాకు గురిచేసింది. ఈ సంఘటనపై కొందరు సోషల్ మీడియాలో కూడా చర్చించుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... తాండూరు పట్టణం ముర్షద్ దర్గా సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లో జింక మాంసం కలిగి ఉన్నాడని ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు శాఖ నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేయడంతో సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుదీర్థంగా తనిఖీ చేసిన తరువాత అధికారులకు ఎలాంటి జింక మాంసం ఆనవాలు లభించలేదు. ఈ విషయాన్ని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అదేవిధంగా తాండూరు అటవి శాఖ అధికారులకు కూడా విషయం తెలయడంతో దర్యాప్తుకు సిద్దమయ్యారు. తాండూరులో జింక మాంసం ఉన్నట్లుగా జరిగిన ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకిరాలేదు. అయినప్పటికి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25867/