schedule Sunday, July 05, 2026

చెలరేగిన మంటలు..!

calendar_today April 2, 2024
person dharshininews
చెలరేగిన మంటలు..!
చెలరేగిన మంటలు..! - బస్సులకు తప్పిన ప్రమాదం - తాండూరు ఆర్టీసీలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డీపోలో ప్రమాద వశాత్తు అగ్ని మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో గతకొన్నేళ్ల నుంచి పిచ్చిమొక్కలు పెరిగాయి. మంగళవారం ప్రమాద వశాత్తు ఈ పిచ్చి మొక్కలకు మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు పెరగడంతో ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించగా వారు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అప్పటికే భారీగా వ్యాపించిన మంటలను అదుపు చేయడంతో సమీపంలో ఉన్న ఆర్టీసీ బస్సులకు ప్రమాదం తప్పింది. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/24613/