schedule Thursday, September 10, 2026

ట్రాఫిక్ చలాన్లు గడువులోగా చెల్లించండి

calendar_today February 11, 2024
person dharshininews
ట్రాఫిక్ చలాన్లు గడువులోగా చెల్లించండి
ట్రాఫిక్ చలాన్లు గడువులోగా చెల్లించండి - తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వాహనాలపై విధించిన ట్రాఫిక్ చలాన్లను గడువులోగా చెల్లించాలని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ సూచించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బైకులతో పాటు ఇతర వాహనాలను ఆపి ట్రాఫిక్ చలాన్ల వివరాలను ఆరా తీశారు. చలాన్లు విధించిన బడిన వాహదారులు చెల్లింపులు చేపట్టేలా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వం టాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లింపులు జరిగేలా ఈనెల 15వ తేది వరకు అవకాశం కల్పించిందన్నారు. ఈ గడువులోగా వాహనదారులు తమ ట్రాఫిక్ చలాన్లను రాయితీ సదుపాయంతో చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23759/