schedule Monday, September 07, 2026

వికారాబాద్ డీఎస్పీకి స్థాన చ‌ల‌నం

calendar_today September 30, 2021
person dharshininews
వికారాబాద్ డీఎస్పీకి స్థాన చ‌ల‌నం
వికారాబాద్ డీఎస్పీకి స్థాన చ‌ల‌నం - చీప్ ఆఫీసుకు బ‌దిలీ, కొత్త డీఎస్పీగా బీవీ స‌త్య‌నారాయ‌ణ వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్సీల బ‌దిలీలు జ‌రిగాయి. ఈ మేర‌కు డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఉత్త‌ర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ డీఎస్పీ సంజీవ‌రావుకు స్థాన చ‌ల‌నం క‌లిగింది. ఆయ‌న‌ను హైద‌రాబాద్ చీఫ్ ఆఫీసుకు బ‌దిలీ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ఆయ‌న స్థానంలో చీఫ్ ఆఫీసులో వెయింటింగ్‌లో ఉన్న బీవీ సత్యనారాయణను వికారాబాద్ ఎస్డీపీవోగా బ‌దిలీ చేశారు. ఈ ఉత్త‌ర్వులు వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి స్ప‌ష్టంగా పేర్కొన్నారు.