schedule Saturday, September 12, 2026

నోరూ మూసి..గొంతు కోసీ..!

calendar_today October 1, 2023
person dharshininews
నోరూ మూసి..గొంతు కోసీ..!
నోరూ మూసి..గొంతు కోసీ..! - ఆర్ఎంపీ వైద్యుడిపై హత్యాయత్నం - తాండూరులో కలకలం - పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : చికిత్స కోసం వచ్చిన గుర్తుతెలియని బాధితులు ఆర్ఎంపీ వైద్యుడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. వైద్యుడి నోరు మూసి.. గొంతు కోస పరారయ్యారు. చేయి విధిలించుకోవడంతో వైద్యుడు ప్రాణాపాయంతో బయటపడ్డారు. అనంతరం పోలీసులకు పిర్యాదు చేశారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాత తాండూరుకు చెందిన మక్బూల్ అహమ్మద్ స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఓ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతని కార్యాలయానికి వచ్చారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు ఆర్ఎంపీ వైద్యుడు ఇప్పుడు సమయం అయిపోయింది. రేపు రండి అని చెప్పడంతో ఓ వ్యక్తి మా అమ్మతో ఫోన్‌లో మాట్లాడాలని ఫోన్ చేసి ఇచ్చాడు. వైద్యుడు ఫోన్‌ మాట్లాడే సమయంలో వెంటనే వ్యక్తి చాకు తీసుకుని గొంతు కోసేందుకు యత్నించాడు. వైద్యుడు చేతితో విడిపించుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని చేతి వేలికి గాయమైంది. అప్పటికే గొంతువద్ద లోతైన గాయం అయ్యింది. బలంగా విధిలించుకోవడంతో వ్యక్తులు ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. అరుపు గమనించిన స్థానికులు వైద్యున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడు స్వయంగా పోలీస్టేషన్‌ కు వెళ్లి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడి చేసిన వ్యక్తులతో గాని, స్థానికులతో గాని తనకు ఎలాంటి పాత శత్రుత్వాలు లేవని వైద్యుడు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20719/