schedule Saturday, September 05, 2026

హస్తం అభ్యర్థులు సిద్దం..!

calendar_today September 21, 2023
person dharshininews
హస్తం అభ్యర్థులు సిద్దం..!
హస్తం అభ్యర్థులు సిద్దం..! - ఫస్ట్ లిస్టులో ఎవరెవరు ఉండొచ్చంటే..? - ఢిల్లీ నుంచి ఎంపిక ప్రక్రియ - 35 స్థానాలను ఖరారు చేయనున్న స్ర్కీనింగ్ కమిటి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: హస్తంలో అభ్యర్థుల వడబోత కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ జాబితాను ఢిల్లీకి పంపించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం హస్తినలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఏకాభిప్రాయం కుదిరితే 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థుల ఖరారు చేయాలనే ఆలోచనలో ఉంది పార్టీ.. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అభ్యర్థులున్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టాలని భావిస్తోంది. మొత్తంగా 119 స్థానాలకు.. 35 స్థానాల్లో అభ్యర్థుల లిస్టు క్లియర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ఖరారు అయిన అభ్యర్థుల జాబితా 1. కొడంగల్ – రేవంత్ రెడ్డి 2. హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. మధిర – భట్టి విక్రమార్క 5. మంథని – శ్రీధర్ బాబు 6. జగిత్యాల – జీవన్ రెడ్డి 7. ములుగు – సీతక్క 8. భద్రాచలం – పొడెం వీరయ్య 9. సంగారెడ్డి – జగ్గారెడ్డి 10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి 11. అలంపూర్ – సంపత్ కుమార్ 12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి 14. కామారెడ్డి – షబ్బీర్ అలీ 15. మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు 16. ఆందోల్ – దామోదర రాజనర్సింహ 17. పరిగి – రామ్మోహన్ రెడ్డి 18. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్ 19. ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి 20. ఆలేరు – బీర్ల ఐలయ్య 21. బాల్కొండ – సునీల్ రెడ్డి 22. ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 23. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి 24. పెద్దపల్లి- విజయ రమణరావు 25. చొప్పదండి- మేడిపల్లి సత్యం 26. నిర్మల్ – శ్రీ హరి రావు 27. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ 28. బెల్లంపల్లి- గడ్డం వినోద్ 29. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్ 30. వేములవాడ- అది శ్రీనివాస్ 31. నర్సాపూర్- ఆవుల రాజీ రెడ్డి 32. జహీరాబాద్ – A చంద్రశేఖర్ 33. ఆసిఫాబాద్ – రేఖ నాయక్/శ్యామ్ నాయక్ 34. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్ 35. మహేశ్వరం- చిగురింత పారిజాత నర్సింహారెడ్డి https://dharshininews.com/20437/