schedule Saturday, September 05, 2026

ట'మోత'కు కళ్లెం..!

calendar_today August 8, 2023
person dharshininews
ట'మోత'కు కళ్లెం..!
ట'మోత'కు కళ్లెం..! - దిగివస్తున్న ధరలు - సామాన్యుడికి ఊరట - ధరలు ఎలా తగ్గుతున్నాయంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా మోత మోగిన టమాట ధరలకు కళ్లెం పడబోతోంది. గత రెండు రోజులుగా టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకూ కిలో టమాట రూ.200 పైగా పలికిన ధరలు అమాతం దిగివచ్చాయి. హైదరాదబాద్‌ రైతుబజారులో కిలో టమాటా రూ.63 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్‌, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్‌ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మార్కెట్‌కు టమాటా రావడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆగస్టు నెలాఖరుకు కిలో రూ.50లోపు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. కిలో టమాటా రూ. 40 నుంచి రూ. 50 మధ్యలో ఉంటే.. వినియోగదారులు, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండని చెబుతున్నారు. తగ్గుతున్న ఈ ధరలు చూస్తే.. మరికొన్ని రోజుల్లో టమాటా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇవి కూడా చదవండి... https://dharshininews.com/19140