schedule Saturday, September 12, 2026

రోడ్డు ఆక్రమణలపై కొరడా..!

calendar_today August 3, 2023
person dharshininews
రోడ్డు ఆక్రమణలపై కొరడా..!
రోడ్డు ఆక్రమణలపై కొరడా..! - తోపుడు బండ్ల తొలగింపు - ట్రాఫిక్‌ ఇబ్బందులకు కళ్లెం - చర్యలు చేపట్టిన పోలీసు, ఆర్టీసీ శాఖ తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్డును ఆక్రమించుకుని ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తున్న వ్యాపారులపై తాండూరు పోలీసు, ఆర్టీసీ శాఖ కొరడా జులిపించారు. గురువారం రెండు శాఖల సంయుక్తంగా చర్యలు చేపట్టింది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఆర్టీసీ డీఎం సమతల ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ మార్గంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డును ఆనుకుని, రోడ్డుపైకి వచ్చిన వ్యాపారాల నిర్మాణాలను తొలగింపు చేయించారు. పండ్ల దుకాణాలు, హోటల్‌ షెడ్లు, ఇతర వ్యాపారులు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించుకుని చేపట్టిన వాటిని తీసివేయించేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు నిత్యం ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తున్న తోపుడు బండ్లను కూడా రోడ్డుపై నుంచి తొలగించే విధంగా చిరువ్యాపారులకు ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న తోపుడు బండ్లకు కళ్లెం వేసే విధంగా దృష్టిసారించారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తొలగింపు చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బస్టాండ్‌ రోడ్డుతో పాటు ఇతర ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి శ్రద్ద వహిస్తున్నామన్నారు. బస్టాండ్‌ రోడ్డులోని ఆక్రమణలకు పాల్పడిన వ్యాపారులు సహకరించాలని సూచించారు. ఆక్రమణలపై చర్యలు చేపట్టే విధంగా కోరడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలను నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19030