schedule Sunday, July 05, 2026

సర్పంచుకు నిర్భందం..!

calendar_today June 19, 2023
person dharshininews
సర్పంచుకు నిర్భందం..!
సర్పంచుకు నిర్భందం..! - ఉపసర్పంచ్, కార్యదర్శిని కూడా - పంచాయతీ కార్యాలయంలో వేసి తాళం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : గ్రామ సర్పంచుతో పాటు ఉపసర్పంచ్, కార్యదర్శిని గ్రామస్తులు నిర్భందించారు. ముగ్గురిని పంచాయతీ కార్యాలయ గదిలో వేసి తాళం వేశారు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో కలకలం రేపింది. ఇందుకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచి సుమలత, ఉపసర్పంచి శ్రీనివాస్‌తో పాటు కార్యదర్శులు గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని గ్రామసభ తీర్మానం లేకుండా కుల సంఘాలకు ఇస్తామని నిర్ణయించారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహించి.. వారితో వాగ్వాదానికి దిగారు. వెంటనే వారిని గదిలోకి పంపి తాళం వేశారు. నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయానికి వచ్చి తాళం తీయించారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18000 chaithany collage