schedule Sunday, September 06, 2026

ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు

calendar_today June 3, 2023
person dharshininews
ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు
ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు - తెలంగాణ ఎన్నికలపై షెడ్యూల్‌ - ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం దర్శిని డెస్క్‌: దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎలక్షన్‌ ఫీవర్ మొదలైంది. ఆయా రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశంలోని మిజోరాం, చత్తీష్‌ఘడ్, మద్య ప్రదేశ్‌, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగే ఎన్నికల తేదిలపై ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత నాలుగేండ్ల కాలంలో మూడేండ్లు ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని, 2024 జనవరి 31 నాటికి మూడేండ్లు పూర్తి చేసుకోబోతున్న వారిని సైతం బదిలీ చేయాలని సూచించింది. వచ్చే జూలై 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ ఏదైనా కారణం చేత బదిలీ చేయడం కష్టమైతే అందుకు కారణాన్ని సీఈవో ద్వారా తెలియజేస్తే అవసరమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎన్నికల విధుల్లో భాగమయ్యే అధికారులు తమకు అభ్యర్థులు, రాజకీయ నేతలతో ఎలాంటి దగ్గరి బంధుత్వం లేదని, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీకి రెండు రోజుల ముందు లోగా డిక్లరేషన్‌ సమర్పించాలని ఆదేశించింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు మిజోరం – 17-12-203 ఛత్తీస్‌గఢ్‌ – 03-01-2024 మధ్యప్రదేశ్‌ – 06-01-2024 రాజస్థాన్‌ – 14-01-2024 తెలంగాణ – 16-01-2024 ఇది కూడా చదవండి... https://dharshininews.com/17539 chaithany collage