schedule Sunday, July 05, 2026

జర్రయితే.. కాటేసేది..!

calendar_today June 1, 2023
person dharshininews
జర్రయితే.. కాటేసేది..!
జర్రయితే.. కాటేసేది..! - పాము నుంచి తప్పించుకున్న బాలిక - వైరల్ అయిన వీడియో దర్శిని డెస్క్‌: మాటు వేసి కాటు వేయడం పాములకు అలవాటే. అలాంటి పాము కాటు నుంచి పాప అదృష్ట వశాత్తు తప్పించుకుంది. అప్పటికే పాము తలెత్తి కాటేసేందుకు సిద్దమయ్యింది. కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. సీసీ టీవీలో నమోదైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక (Karnataka) బెళగావి జిల్లాలోని ‘హలగా’ గ్రామంలోని ఓ ఇంటి గుమ్మం దగ్గర బుసలు కొడుతున్న పామును గమనించని బాలిక.. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు వద్దకు రాగానే పాము తలపైకి ఎత్తి ఆమెను కాటువేసేందుకు చూసింది. కొద్దిసేపు గుమ్మం డోర్ దగ్గర నిలబడ్డ ఆ చిన్నారిని, లోపల ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో ఆమె ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. https://youtu.be/2XNPPr_7YMs ఇది కూడా చదవండి... మహిళా సంఘాలకు గుడ్‌ న్యూస్‌ - రూ.15,037 కోట్ల రుణాలకు సర్కారు ఆమోదం - గత యేడాది కంటే రూ.2315 కోట్లు అధికం https://dharshininews.com/17490 chaithany collage