schedule Sunday, September 06, 2026

డెడ్‌ బాడీపై అఘోరా పూజలు

calendar_today May 31, 2023
person dharshininews
డెడ్‌ బాడీపై అఘోరా పూజలు
డెడ్‌ బాడీపై అఘోరా పూజలు - స్నేహితుడి అంత్యక్రియల్లో ఘటన దర్శిని డెస్క్‌ : స్మశానాల్లో ఉండే అఘోరాలు పూజలు చేయడం కామన్. తన స్నేహితుని అంత్యక్రియల్లో పాల్గొని మృతదేహంపై కూర్చుని పూజలు చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా సూలూర్‌ వద్ద ఆదివారం జరిగింది. సూలూర్‌ సమీపం కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్‌.. అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం వివాహమైంది. అభిప్రాయభేదాలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన మణికంఠన్‌ ఆదివారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తిరుచ్చికి చెందిన అతడి చిన్ననాటి స్నేహితుడు ఒకరికి తెలిసింది. ప్రస్తుతం అఘోరాగా ఉంటున్న ఆ వ్యక్తి సూలూర్‌కి వచ్చి మణికంఠన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేశాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావడంతో పాటు వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి... కాళ్లకు కరెంటు చెప్పులు..! - అమ్మాయిల కోసం రూపకల్పన - ఆకతాయి వేషాలేస్తే అంతే సంగతులు - చెప్పుల ధర కూడా అందుబాటులోనే https://dharshininews.com/17455 chaithany collage