schedule Sunday, September 06, 2026

కూతురే.. కొడుకై..!

calendar_today May 29, 2023
person dharshininews
కూతురే.. కొడుకై..!
కూతురే.. కొడుకై..! - తండ్రికి అంతిమ సంస్కారాలు - అభినందించిన గ్రామస్తులు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: కూతురే కొడుకై తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. చదువు.. ఉద్యోగం.. టెక్నాలజీలో పురుషులకు ధీటుగా దూసుకుపోతున్నా.. పితృకర్మల విషయాల్లో స్త్రీలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఓ స్త్రీ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించి అభినందనలు పొందింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన బండి వెంకటనర్సమ్మ తండ్రి బింగి నారాయణ వృద్ధ్యాప్యంతో మరణించాడు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో పెనుబల్లిలోని కూతురు వద్ద జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి అన్నీ తానై సపర్యలు చేసింది. ఈ క్రమంలోనే.. వృద్ధాప్యంతో తండ్రి నారాయణ కూతురు ఇంట్లోనే కన్నుమూశాడు. అయితే.. కొడుకులు లేకపోవడంతో నారాయణ అంత్యక్రియలు కూతుళ్లు, అల్లుళ్లే నిర్వహించారు. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి.. కూతురే కొడుకుగా మారి.. తండ్రికి తలకొరివి పెట్టింది వెంకటనర్సమ్మ. దాంతో.. కొందరు ఆశ్చర్యపోయినప్పటికీ.. రోజులు మారుతున్నప్పుడు.. సంప్రదాయాలు కూడా మారాల్సిన అవసరముందంటూ ఆమెకు అండగా నిలిచి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు గ్రామస్తులు. తండ్రికి తలకొరివి పెట్టిన కూతుర్ని అభినందించారు. వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి... 9న కులవృత్తిదారులకు ఆర్థికసాయం..! - ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. లక్ష - ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు అవకాశం - విధివిధానాలను ప్రకటించనున్న సర్కారు https://dharshininews.com/17428 chaithany collage