schedule Sunday, July 05, 2026

బీజేపీ ఎమ్మెల్యే పాడుపని..!

calendar_today March 30, 2023
person dharshininews
బీజేపీ ఎమ్మెల్యే పాడుపని..!
బీజేపీ ఎమ్మెల్యే పాడుపని..! - అసెంబ్లీలో అసభ్య వీడియో చూసిన ఎమ్మెల్యే - కలకలం రేపుతున్న త్రిపుర సంఘటన - సోషల్ మీడియాలో వైరల్‌ అయిన వార్త దర్శిని డెస్క్‌: అసెంబ్లీ హాల్‌లో ఓ ఎమ్మెల్యే అసభ్యకరమైన వీడియో చూడడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌ అయిన ఈ న్యూస్ త్రిపురలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. త్రిపురాలో అసెంబ్లీ సమావేశాలలో బగ్ బాస్సా నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎన్నికైన జదవ్ లాల్ నాథ్ అనే ఎమ్మెల్యే ఆ సమావేశాలకు హాజరయ్యారు. ఒకపక్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించిన విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈయన మాత్రం కూర్చిలో కూర్చోని తన మొబైల్ లో ఓ అశ్లీల వీడియో చూడటం కలకలం రేపింది. జదవ్ లాల్ తన మొబైల్ లో వస్తున్న వీడియోలను స్క్రోల్ చేస్తూ చూస్తున్నారు. ఓ అశ్లీల వీడియో రావడంతో దాన్ని స్క్రోల్ చేయకుండా అలాగే చూశారు. అయితే దీన్ని ఆ ఎమ్మెల్యే వెనుక కూర్చొని ఉన్న మరో వ్యక్తి వీడియో తీయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జదవ్ లాల్ నాథ్ తీరుపై బీజేపీ సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆ ఎమ్మెల్యేను కోరగా ఆయన మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించలేదు. పబ్లిక్ ప్లేస్ లో బీజేపీ నాయకులు అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోవడం ఇది మొదటిసారి కాదు. 2012లో కూడా కర్నాటకలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పడు లక్ష్మణ్ సావడి, సీసీ పాటిల్ అనే ఇద్దరు బీజేపీ మంత్రులు అశ్లీల దృశ్యాలు చూస్తూ దొరికియారు. ఆ తర్వాత వారు బలవంతంగా రాజీనామ చేయాల్సి వచ్చింది. దీనిపై విచారణ మొత్తం పూర్తయ్యాక మళ్లీ బీజేపీ వారికి తమ పదవులు ఇచ్చింది.