schedule Sunday, July 05, 2026

అత్తమీద అలిగిన అల్లుడు

calendar_today March 5, 2023
person dharshininews
అత్తమీద అలిగిన అల్లుడు
అత్తమీద అలిగిన అల్లుడు - బంగారం పెట్టలేదని విద్యుత్ స్థంభం ఎక్కి మారాం - కిందకు దిగేది లేదని చాలా సేపు హల్‌ చల్ మెదక్‌, దర్శిని ప్రతినిధి: పెళ్లి అన్నాక అలకలు మామూలే. అవి పెళ్లి తరువాత కూడ జరిగితే వింతే. ఇదే తరహాలో ఓ అత్తమీద అల్లుడు అలిగాడు. పెళ్లి తరువాత బంగారం పెట్టలేదని విద్యుత్‌ స్థంభం ఎక్కి మారాం చేశాడు. కిందకు దిగనని హల్‌ చేశాడు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం గాంధీనగర్‌కు చెందిన శేఖర్ ఎలక్ట్రిషన్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను కొంతకాలం క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ అయినా మాకు అత్తగారు బంగారం పెట్ట డంలేదని మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో ఆదివారం కరెంటు స్తంభం ఎక్కి హల్‌ చల్ చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరు కున్నారు. అతడిని కిందికి దించడానికి ప్రయత్నించినా చాలాసేపు వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు నచ్చజెప్పడంతో స్తంభం దిగి కిందికి వచ్చాడు. అతడు సురక్షితంగా కిందకు రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.