schedule Sunday, July 05, 2026

కారుతో గుద్దితే.. గాల్లో ఎగిరిపడ్డాడు..!

calendar_today March 3, 2023
person dharshininews
కారుతో గుద్దితే.. గాల్లో ఎగిరిపడ్డాడు..!
కారుతో గుద్దితే.. గాల్లో ఎగిరిపడ్డాడు..! - 20 అడుగుల దూరంలో పడి గాయాలు - వ్యక్తికి తప్పిన ప్రాణాపాయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మిట్ట మధ్యాహ్నం ఓ వ్యక్తి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఎదురుగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. అంతే వ్యక్తి ఒక్కసారిగా గాల్లో ఎగురుతూ 20 అడుగుల దూరంలో పడిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఈ సంఘటనలో ప్రమాదానికి గురైన వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో కుషాయిగూడ సమీపంలోని నాగారంలో నివసించే జైకుమార్‌(50) నాగోలులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఉద్యోగి. గురువారం మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో నాగోలులోని రామాలయం వద్ద నడుస్తూ సంస్థ కార్యాలయం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. బాధితుడు అమాంతం గాల్లోకి ఎగిరి 20 అడుగుల దూరంలో పడి గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులోని మహిళ సైతం అతని వెంట ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.