schedule Sunday, September 06, 2026

మళ్లీ తగ్గిన బంగారం ధర

calendar_today February 24, 2023
person dharshininews
మళ్లీ తగ్గిన బంగారం ధర
మళ్లీ తగ్గిన బంగారం ధర - కొనసాగుతోన్న పసిడి ధరల పతనం - మరోసారి ఎంత తగ్గిందంటే..? దర్శిని డెస్క్‌: దేశంలో గత నాలుగు రోజుల నుంచి ప్రతీ రోజూ బంగారం ధరలు పతనమవుతున్నాయి. వారం రోజుల్లో తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 600 వరకు తగ్గడం అందరికి తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 220 వరకు తగ్గింది. తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 220 వరకు తగ్గింది. ఓవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. నేడు దేశంలోని పలు మేజర్‌ పట్టణాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,610 ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది. * చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,220 ఉంది. * బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,560గా ఉంది. * హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.