schedule Monday, September 07, 2026

వైద్యులు అందుబాటులో ఉండాలి

calendar_today September 7, 2021
person dharshininews
వైద్యులు అందుబాటులో ఉండాలి
వైద్యులు అందుబాటులో ఉండాలి - రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించాలి - వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ నిఖిల‌ వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వైద్యులు రోగుల‌కు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవ‌లందించాల‌ని వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ నిఖిల అన్నారు. మంగ‌ళ‌వారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వాక్సినేషన్, ఐసాలేషన్, ఆవిజర్వేషన్ రూంలతో పాటు నిర్మాణంలో ఉన్న ఇతర గదులను క‌లెక్ట‌ర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకు వైద్య సిబ్బంది అందరు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుప‌త్రిలో ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. క‌లెక్ట‌ర్ వెంట‌ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డాక్టర్ యాదయ్య, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.