schedule Monday, September 07, 2026

పాపం పసివాడు..!

calendar_today February 12, 2023
person dharshininews
పాపం పసివాడు..!
పాపం పసివాడు..! - తండ్రిని బతికించుకునేందుకు తపన - కిలో మీటర్లు తోపుడు బండి ద్వారా ఆసుపత్రికి - సోషల్ మీడీయాలో కంటతడి పెట్టిస్తున్న వీడియో దర్శని డెస్క్‌: లోకమంటే ఇంకా ఏంటో తెలియదు.. కాని తండ్రి అంటే అమితమైన ప్రేమ. అనారోగ్యంతో ఉన్న తండ్రిని కాపాడుకునేందుకు ఆరేళ్ల బాలుడి తపన కంటతడి పెట్టిస్తోంది. చిట్టి చేతులతో మండే ఎండలను సైతం లెక్కచేయకుండా తండ్రిని తోపుడు బండిపై తీసుకుంటూ వచ్చాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పసివాడి వీడియో అందరి చేత అయ్యో పాపం అనిపించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఆరేళ్ల పిల్లవాడు తన తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లడం కనిపిస్తుంది. దాదాపు మూడు కిలోమీటర్లు నడిచాక బాలుడు కాళ్లూ, చేతులు నొప్పిపుట్టడంతో బండిని పట్టుకుని రోడ్డుపై కూర్చోవడం వీడియోలో కనిపిస్తుంది. బండికి ముందు వైపు తల్లి కూడా బండిని తోస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనీసం అంబులెన్స్‌ సదుపాయం కూడా కల్పించలేని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణ జరపాలని అధికారులు ఆదేశించింది. వీడియో కోసం ట్విట్టర్‌ లింక్‌పై క్లిక్ చేయండి. शायद मध्य प्रदेश की एंबुलेंस गरीबों के लिए नहीं है, इसलिए मरीज़ को ठेले पर लिटाकर अस्पताल ले जाया जा रहा है!! वीडियो मे मरीज़ की पत्नी और बेटे ठेले को धक्का लगाकर ले जा रहे है!#MadhyaPradesh #सिंगरौलीhttps://t.co/7uIlBCDFZq pic.twitter.com/VD6N5nSUow — Sadaf Afreen صدف (@s_afreen7) February 11, 2023