schedule Monday, September 07, 2026

ఆశ్రమ ఏర్పాటుకు తోడ్పాటు

calendar_today January 17, 2023
person dharshininews
ఆశ్రమ ఏర్పాటుకు తోడ్పాటు
ఆశ్రమ ఏర్పాటుకు తోడ్పాటు -  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - ఎమ్మెల్సీని కలిసిన శివస్వాములు  తాండూరు, దర్శిని ప్రతినిధి: శివ స్వాఉమల కోసం ఆశ్రమం ఏర్పాటు చేసేందుకు తనవంతు తోడ్పాటు అందిస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాలసంలో పాత తాండూరు కోటేశ్వర దేవాలయ శివ స్వాములు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోటేశ్వర దేవాలయంలో ఆశ్రమం లేక స్వాములు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆశ్రమ ఏర్పాటుకు సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందిస్తూ శివ స్వాములు కోరిన విధంగా ఆశ్రమ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని అన్నారు. శివస్వాములు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.