schedule Monday, September 07, 2026

బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సయ్యద్ షుకూర్

calendar_today September 5, 2022
person dharshininews
బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సయ్యద్ షుకూర్
బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సయ్యద్ షుకూర్ - ఆర్ .కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం - హ‌ర్షం వ్య‌క్తం చేసిన కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తాండూరుకు చెందిన సయ్యద్ షుకూర్ నియామకం అయ్యారు. సోమవారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ సమక్షంలో షుకూర్‌కు నియామకం పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలు, మైనార్టీల కోసం ఉద్యమిస్తున్న సయ్యద్ షుకూర్‌ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం కావడం హర్షణీయమన్నారు. సుదీర్ఘ కాలంగా బీసీల త‌రుపున పోరాడుతున్న షుకూర్‌కు గౌర‌వం ద‌క్కింద‌న్నారు. అదేవిధంగా సయ్యద్ షుకూర్ మాట్లాడుతూ బీసీలు, మైనార్టీల సంక్షేమానికి ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానని పేర్కొన్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.