schedule Monday, September 07, 2026

విద్యార్థుల‌కు గుడ్ న్యూస్

calendar_today August 31, 2021
person dharshininews
విద్యార్థుల‌కు గుడ్ న్యూస్
విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ - రేప‌టి నుంచి బ‌స్‌పాస్‌ల జారీ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజక‌వ‌ర్గంలోని విద్యార్థుల‌కు తాండూరు ఆర్టీసీ సంస్థ శుభ‌వార్త చెప్పింది. రేప‌టి నుంచి విద్యార్థులకు బస్‌పాసుల‌ను జారీ చేయ‌బోతున్న‌ట్లు డీపో మేనేజ‌ర్ రాజ‌శేఖ‌ర్ మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తాండూరు, కోడంగల్ బస్ స్టేషన్‌ల‌లో విద్యార్థుల‌కు ఫ్రీ పాస్, రూట్ పాస్, స్టూడెంట్ పాస్, జనరల్ పాస్ ఇవ్వడం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. విద్యార్థులు, వినియోగ‌దారులు ఉద‌యం 10.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు బ‌స్టాండ్‌ల‌లోని కౌంట‌ర్ల‌లో సంప్ర‌దించాల‌ని అన్నారు. ఈ అవకాశాన్ని అంద‌రు వినియోగించుకోవాల‌ని సూచించారు.