schedule Friday, September 04, 2026

తెలియక ట్రైన్ దిగిన తాత..!

calendar_today August 27, 2026
person dharshininews
తెలియక ట్రైన్ దిగిన తాత..!
తెలియక ట్రైన్ దిగిన తాత..! - తాండూరులో నిజామాబాద్‌ వృద్ధుడు మిస్సింగ్   - రాయలసీమ ట్రైన్‌ నుంచి వచ్చినట్లు అనుమానం - ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రైల్వే స్టేషన్‌లో రైలు దిగి ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. కాగా వృద్దుడు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వాడు కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం సంతోష్‌నగర్ తండాకు చెందిన భూక్య నారాయణ (60) కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో తాండూరు రైల్వే స్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ నుంచి భూక్య నారాయణ కుటుంబ సభ్యులకు తెలియకుండా దిగిపోయారు. రైలు నుంచి దిగిన అనంతరం ఆయన ఎక్కడికి వెళ్లారన్నది తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బంధువులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆయన కోసం వెతుకుతున్నారు. భూక్య నారాయణ తాండూర్ పట్టణం లేదా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఆచూకీ తెలిస్తే సెల్‌ : 8712513845, 8886025502లకు సమాచారం అందించాలని కోరుతున్నారు. https://www.dharshininews.com/44400/