విద్యార్థుల సంక్షేమంపై దృష్టి..!
September 3, 2026
dharshininews
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి..!
- నాణ్యమైన భోజనం, మెరుగైన వసతుల కల్పనకు కృషి
- చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
- సాయిపూర్ ఎస్టీ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వసతి గృహ విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.
గురువారం సాయిపూర్ బాలికల ఎస్టీ హాస్టల్‌ను తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యతను పరిశీలించిన చైర్‌పర్సన్.. భోజనం ఎలా ఉంటుందో విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో వసతులు, ఇతర సమస్యలపై కూడా విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, హాస్టల్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, 10వ వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44515/