మహిళలకు మొండి చెయ్యి..!
September 4, 2026
dharshininews
మహిళలకు మొండి చెయ్యి..!
- వెయ్యి రోజుల పాలనలో దగా
- రూ.2,500, తులం బంగారంపై నిలదీయండి
- కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ పోరాటం
- తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
- భద్రేశ్వర చౌరస్తాలో వంటా వార్పుతో నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల ముందు మహిళలకు హామిల వర్షం కురిసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజుల పాలనలో వారికి మొండి చెయ్యి చూపిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో తాండూరు పట్టణంలోని భద్రేశ్వర కూడలిలో నిర్వహించిన వెయ్యి రోజుల పాలనపై వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సదస్సులో వంటా వార్పు కార్యక్రమంతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమమంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెత్తేస్తోందని విమర్శించారు. ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని, ప్రతి మహిళను మహాలక్ష్మిని చేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసి మహిళలు బస్సుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.
తాండూరు నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లడానికి బస్ స్టాండ్‌కు వెళ్తే గంటల తరబడి నిలబడినా బస్సులు రావడం లేదని అన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పది మంది మహిళలకు ఇచ్చి అందరికి ఇచ్చినట్లు చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1000 రోజులు అవుతుందని, మరి మహిళలను కోటీశ్వరులను ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పెళ్లి చేసుకున్న వారిలో ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా అని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
మహిళలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, పార్టీ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44532/