schedule Wednesday, September 09, 2026

వాగులో మృతదేహం..!

calendar_today February 3, 2025
person dharshininews
వాగులో మృతదేహం..!
వాగులో మృతదేహం..! - తెలియని మృతుని వివరాలు - యాలాల కోకట్ కాగ్నాలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వాగులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. ఈ సంఘటన యాలాల మండలం కోకట్ కాగ్నా నదిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కోకట్ సమీపంలోని కాగ్నానదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు యాలాల పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియరాలేదు. అయితే మృతుడు మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతునికి సుమారు 35 నుంచి 40 ఏండ్ల వయస్సు ఉండొచ్చని అంచనా వేశారు. మృతదేహాన్ని వాగులో నుంచి వెలికి తీశారు. ఈ మేరకు గుర్తుతెలియని మృతుని కేసును దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32767/