schedule Thursday, September 10, 2026

పది నిమిషాల్లో పనిముగించారు..!

calendar_today January 12, 2025
person dharshininews
పది నిమిషాల్లో పనిముగించారు..!
పది నిమిషాల్లో పనిముగించారు..! - వైన్‌ షాపులో పడిన దొంగలు - మద్యం బాటిళ్లు, నగదు అపహరణ - పెద్దేముల్ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వామ్మో.. టాలెంటెడ్ దొంగలు.. వైన్‌ షాపులోకి చొరబడి పది నిమిషాల్లోనే చక్కగా సర్దేసుకున్నారు. షాపులో ఉన్న మద్యం బాటిళ్లతో పాటు నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ మండల కేందరంలో ఉన్న ఓ వైన్‌ షాపును నిర్వహకులు శనివారం రాత్రి యధావిధిగా మూసి వేసి వెళ్లి పోయారు. అర్దరాత్రి 2 గంటల తరువాత బైకులపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు షాపు షెటర్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. షాపులో ఉన్న సుమారు 5వేల మద్యం బాటిళ్లు, గల్లా పెట్టేలోని రూ. 2వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలతో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు చూసి నిర్వహకులు షాక్‌కు గురయ్యారు. కేవలం పది నిమిషాల్లోనే చోరీకి చేసినట్లు గుర్తించారు. జరిగిన చోరిపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతామని పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32209/