schedule Thursday, September 10, 2026

టైలర్‌ షాపులో షాక్ సర్క్యూట్..!

calendar_today January 1, 2025
person dharshininews
టైలర్‌ షాపులో షాక్ సర్క్యూట్..!
టైలర్‌ షాపులో షాక్ సర్క్యూట్..! - కాలి బూడిదైన బట్టలు, దగ్దమైన మిషన్లు - యజమానికి భారీ నష్టం - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ టైలరింగ్ షాపులో షాక్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో షాపులో ఉన్న కుట్టు మిషన్లు దగ్దమయ్యాయి. కుట్టు బట్టలు బూడిదయ్యాయి. ఈ సంఘటన బుధవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని వినాయక చౌరస్తాలో విక్టరీ టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి షాపు మూసి వేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం షాపులో వచ్చిన మంటలను గమనించి స్థానికులు ఆయనకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని వచ్చి చూసే సరికి షాపులో ఉన్న వస్తువులు, మిషన్లు, బట్టలు కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే షాక్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31882/