schedule Thursday, September 10, 2026

పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు..!

calendar_today October 28, 2024
person dharshininews
పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు..!
పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు..! - 7మంది పేకాట రాయుళ్ల అరెస్టు - మార్కండేయ కాలనీలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. సోమవారం తాండూరు పట్టణ శివారు యాలాల మండల పోలీస్టేషన్‌ పరిధిలోని మార్కండేయ కాలనీలో దాడులను కొనసాగించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 7 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి రూ. 16వేల 120లు, సెల్‌ ఫోన్లతో పాటు పేకాట ముక్కలను స్వాదీనం చేసుకున్నారు. నిందితులను యాలాల పోలీస్టేషన్‌లో అప్పగించగా పోలీసులు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30066/