schedule Sunday, July 05, 2026

పాన్‌ షాపుల్లో హుక్కా దందా..!

calendar_today January 30, 2024
person dharshininews
పాన్‌ షాపుల్లో హుక్కా దందా..!
పాన్‌ షాపుల్లో హుక్కా దందా..! - గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్‌ పోలీసులు - తాండూరులో రూ. 50వేల సామాగ్రి స్వాదీనం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో హుక్కా దందా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఎస్ఐ ప్రశాంత్ వర్దన్, బృందంతో పాటు తాండూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో పలు పాను షాపులలో తనిఖీలు కొనసాగించారు. ఈ క్రమంలో షాపు యజమానులు నిబంధనలకు విరుద్దంగా హుక్కా దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హుక్కా సామాగ్రితో పాటు ఫ్లేవర్లు, గంజాయి సేవించే స్ట్రీపులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీలలో ఆయా షాపుల నుంచి దాదాపు రూ. 50వేల విలువైన సామాగ్రిని స్వాదీనం చేసుకుని యజమానులను పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేస్తామని తాండూరు పట్టణ పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా నిషేధిత మత్తు పదార్ధాల విక్రయాలకు పాల్పడితే చట్టరిత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/23533/