schedule Sunday, July 05, 2026

గుట్టుగా రేషన్ డంపులు..!

calendar_today January 18, 2024
person dharshininews
గుట్టుగా రేషన్ డంపులు..!
గుట్టుగా రేషన్ డంపులు..! - టాస్క్ ఫోర్స్ దాడులతో రట్టు - 23 క్వింటాళ్ల బియ్యం పట్టివేత - తాండూరు పోలీస్ స్టేషన్లో కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి: అక్రమ వ్యాపారులు నిల్వ ఉంచిన రేషన్ డంపుల గుట్టును జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులతో రట్టు అయ్యింది. వ్యాపారుల నుంచి 23 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన గురువారం రాత్రి తాండూరు పట్టణ పోలీస్ పరిధిలో జరిగింది. తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా ప్రాంతంలో ఓ వ్యక్తి 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచుకున్నట్లు సమాచారం అందింది. దీంతో విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.   అదేవిధంగా పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ మార్గంలో కూడా మరో వ్యక్తి 8 క్వింటాళ్ల బియ్యాన్ని ఒక గోదాంలో నిల్వ ఉంచినట్లు సమాచారం అందగా అక్కడ కూడా దాడులు నిర్వహించారు. ఈ రెండు దాడుల్లో మొత్తం 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీట్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచుకున్న వ్యాపారులపై కేసు నమోదు చేయనున్నట్లు పట్టణ పోలీసులు వెల్లడించారు.     ఇది కూడా చదవండి...   https://dharshininews.com/23243/