నీటి వృధాకు చెక్..
August 22, 2021
dharshininews
నీటి వృధాకు చెక్..
- పైపులైన్‌కు మరమ్మత్తులు పూర్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో మిషన్ భగీరథ నీటి వృధాగాకు అధికారులు చెక్ పెట్టారు. శనివారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ.. కోర్టు మార్గంలో పైపులైన్ ధ్వంసం కారణంగా మిషన్ భగీరథ నీరు వృధాగా పారిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారుల సమన్వయ లోపంతో తాగునీరు వృధాగా పారిందని తేటతెల్లమయ్యింది. దీంతో మరోసారి
సమస్య తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు మరమ్మత్తు చర్యలు చేపట్టారు. కోర్టు మార్గంలో ధ్వంసమైన పైపులైన్‌కు మరమ్మత్తులు పూర్తి చేశారు. తాగునీటీ వృధా కారణంగా శనివారం వెంకటేశ్వర కాలనీ, యశోధనగర్ తదితర ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం మరమ్మత్తులు పూర్తి నీటి సరఫరా చర్యలను చేపట్టారు. దీంతో స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.