schedule Thursday, September 03, 2026

పైపులైన్ పగిలి...

calendar_today August 21, 2021
person dharshininews
పైపులైన్ పగిలి...
పైపులైన్ పగిలి... వృధాగా మిషన్ భగీరథ నీరు తాండూరు, దర్శిని ప్రతినిధి: పైపులైన్ పగిలి తాగు నీరు వృధాగా పారింది. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. తాండూరు పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పైపులైన్ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. కొత్త పైపులైన్ అనుసంధానం కోసం పట్టణంలోనీ కోర్టు మార్గంలోని పైపులైన్ తవ్వి వదిలేశారు. దీంతో శనివారం ఉదయం తాగునీరు సరఫరా సమయంలో తాగు నీరు వృధాగా పారింది. దాదాపు 2 గంటల పాటు నీరంతా వృధాగా పారింది. పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజి మైదానంలో నీరంతా చేరింది. తాగునీరు వృధా కావడంతో సమీప కాలనీలకు తాగునీరు సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు తాగునీరు వృధాపై అధికారులకు సంమాచారం అందించిన స్పందించలేదని స్థానికులు ఆరోపించారు.