పాత తాండూరులో విషాధం..!
September 14, 2026
dharshininews
పాత తాండూరులో విషాధం..!
- అనారోగ్యం, అస్వస్థతతో యువకుడి మృతి
- వినాయక చవితి ఉత్సవాలు రద్దు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో విషాధం నెలకొంది. అనారోగ్యానికి గురైన ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు.
ఈ కారణంగా స్థానికులు వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాత తాండూరు అంబేద్కర్ నగర్‌కు చెందిన జెట్టపాగ నరేష్(31) చలి జ్వరంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం పట్టణంలోని ప్రవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నాడు. రాత్రి ఇంటికి వెళ్లి తిని మందులు వేసుకుని పడుకున్నాడు.
అర్దరాత్రి దాటిన తరువాత మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న వయస్సుల్లోనే తండ్రిని కోల్పోయిన నరేష్ ఆత్మ స్థైర్యంతో తల్లి, తమ్ముడు, చెల్లిని పోషిస్తూ వచ్చాడు.
ఇప్పుడు నరేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నరేష్ మృతిపట్ల స్థానికులు గణేష్ ఉత్సవాలను రద్దు చేసుకున్నారు. సిద్దం చేసుకున్న సామాగ్రిని ఇతరులకు ఇచ్చేశారు. మరోవైపు జిల్లా ఆసుపత్రిలో సరైన వైద్యులు అందుబాటులో లేకపోవడం.. నరేష్ మృతికి కారణమంటూ ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
https://www.dharshininews.com/44694/