దుష్ట పాలనపై సమరం ఆగదు
September 8, 2026
dharshininews
దుష్ట పాలనపై సమరం ఆగదు
- కేసీఆర్‌తో పెట్టుకుంటే అల్లకల్లోలమే
- మహిళ ఎమ్మెల్యేల పట్ల తీరు అమానుషం
- దాడులు, దౌర్జన్యాలను సాగనివ్వం
- ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణితో భయం
- బీఆర్‌ఎస్ సమరభేరీ సంపూర్ణ విజయవంతం
- తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఇచ్చిన హామిలను అమలు చేయకుండా.. నిలదీసేందుకు పోరాడుతున్న వారిపై దాడులు.. దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ దుష్ట పాలన సాగనిచ్చేది లేదని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు.
మంగళవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి మీడీయాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సమరభేరీ కార్యక్రమం సంపూర్ణ విజయవంతం అయ్యిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారని తెలిపారు. 420 మోసాలు, హామిలు, 13 డిక్లరేషన్‌లు, 6 గ్యారెంటీలతో పాటు 12అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిన కార్డులను ఇంటింటికి పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.
దీంతో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని అన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యానికి ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని, పోలీసుల అండతో పార్టీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన కేటీఆర్, హరీష్ రావులు పోరాడుతుంటే మింగుడు పడడం లేదని అన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని ఎదురు దాడి చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరిష్ రావులకు రాజీనామాలు కొత్తకాదని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరంపై యుద్దానికి సిద్దమవుతున్నారని తెలిపారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే అల్లోకల్లోలం తప్పదని అన్నారు. 100 రోజుల్లో రాష్ట్రాన్ని స్వర్గంలా మారుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో నరకంగా మార్చారని విమర్శించారు. మిగిలిన రోజుల్లో అయినా ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో దౌర్జన్య పాలనను సాగనిచ్చేదిలేదని హెచ్చరించారు.
మహిళ ఎమ్మెల్యేలపై తీరు అమానుషం
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్న మహిళ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి సబితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహరించిన తీరు అమానుషం అని అన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ నేతలను అక్రమంగా జైలుపాలు చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరీ ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, మాజీ వైస్ చైర్మన్లు పట్లోళ్ల దీపా నర్సింలు, ఆసిఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, కోహిర్ శ్రీనివాస్, నాయకులు సిద్రాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్, సంతోష్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
https://www.dharshininews.com/44606/