schedule Tuesday, September 08, 2026

బీసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి!

calendar_today September 8, 2026
person dharshininews
బీసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి!
బీసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి! - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్  - తాండూరు మున్సిపల్ కార్యాలయ ముట్టడి - చైర్ పర్సన్, కమిషనర్ కు వినతి పత్రం అందజేత  తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీ శ్మశాన వాటికల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, వాటిని అభివృద్ధి చేయాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యుడు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు తాండూరు మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించి కమిషనర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పాత తాండూరులోని బీసీ శ్మశాన వాటికతో పాటు తాండూరు పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న శ్మశాన వాటికలు సరైన వసతులు లేక దుర్భరంగా మారాయని రాజ్‌కుమార్‌ తెలిపారు. చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చిమొక్కలు, ముళ్లచెట్లు పెరిగి అపరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న బీసీ శ్మశాన వాటికలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి చెత్తను పూర్తిగా తొలగించాలని డిమాండ్‌ చేశారు. జేసీబీలు, ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ముళ్లచెట్లు, పిచ్చిమొక్కలను తొలగించడంతో పాటు శ్మశాన వాటికలకు కనీస వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. బీసీ సంఘం వినతిపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. శ్మశాన వాటికల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, ముళ్లచెట్లను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్‌ షుకూర్‌, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్‌, మండల అధ్యక్షులు నరేంద్ర్‌, బసంత్‌కుమార్‌, లక్ష్మణాచారి, వివిధ బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44603/