వేదిక్ విశిష్టలో ఘనంగా క్రిష్ణాష్టమి..!
September 5, 2026
dharshininews
వేదిక్ విశిష్టలో ఘనంగా క్రిష్ణాష్టమి..!
- కృష్ణుడు, గోపికల వేషాల్లో చిన్నారుల సందడి
- ఆకట్టుకన్న నృత్య ప్రదర్శనలు
- అభినందించిన హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డీసీఎంఎస్ ఆవరణలోని వేదిక్ విశిష్ట ది స్కూల్‌లో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపల్ శేరి మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు పండుగ శోభను సంతరించుకున్నాయి.
శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో విద్యార్థులు అలరించారు. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా.. ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను సందడిగా మార్చారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగభూషణం మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి పండుగలను పాఠశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలు, ఆదర్శాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
వైస్ ప్రిన్సిపల్ శేరి మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వేషధారణలు, నృత్యాలు, ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అభినందించారు.
కార్యక్రమానికి హిందూ ఉత్సవ సమితి సభ్యులు హాజరై విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44558/