schedule Thursday, September 03, 2026

శభాష్‌ జావిద్‌ భాయ్‌..!

calendar_today September 1, 2026
person dharshininews
శభాష్‌ జావిద్‌ భాయ్‌..!
శభాష్‌ జావిద్‌ భాయ్‌..! - రాజీవ్‌, ఇందిరమ్మ కాలనీల ప్రగతికి పట్టు - ఉద్యమం, ఆందోళనలతో సీసీ రోడ్లు మంజూరు - ఘనంగా సన్మానించిన కాలనీవాసులు తాండూరు, దర్శిని ప్రతినిధి: రాజీవ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్‌ జావిద్‌ ను కాలనీ వాసులు శభాష్ అంటూ ప్రశంసించారు. మంగళవారం కాలనీ వాసులు జావిద్ ను ఘనంగా సన్మానించారు. గతంలో నిలిచిపోయిన సీసీ రోడ్ల పనులపై పలుమార్లు ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టడంతో సమస్యను పరిష్కారం లభించినట్లు అయ్యిందని స్థానికులు తెలిపారు. రాజీవ్‌ కాలనీలో రూ.14 లక్షలు, ఇందిరమ్మ కాలనీలో రూ.11 లక్షలు కలిపి మొత్తం రూ.25 లక్షలతో సీసీ రోడ్ల పనులు మంజూరైనట్లు తెలిపారు. దీంతో ఎన్నాళ్లుగా రోడ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్న తమకు ఉపశమనం కలగనుందని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ జావిద్‌ ముందుంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వృద్ధుల పింఛన్ల దరఖాస్తుల విషయంలో అధికారులతో మాట్లాడి అర్హులకు పింఛన్లు అందేలా చొరవ తీసుకున్నారని తెలిపారు. నిత్యం కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్‌ జావిద్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ ప్రజాసేవ తన ధ్యేయం అని అన్నారు. కాలనీ అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు.. https://www.dharshininews.com/44485/