schedule Thursday, September 03, 2026

పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ..!

calendar_today September 1, 2026
person dharshininews
పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ..!
పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ..! - రేపు 200ల మందికి రూ.1.50 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ - కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాతుల నాగరాజు అన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందించేందుకు రేపు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాగరాజు తెలిపారు. తాండూర్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 200 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.1.50 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చైర్మన్లు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బాతుల నాగరాజు కోరారు.   https://www.dharshininews.com/44473/