ఇంటర్ నుంచే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
August 31, 2026
dharshininews
ఇంటర్ నుంచే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
- రీల్స్‌ను పక్కన పెట్టి రియాల్టీలో జీవించాలి
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- ఉత్సహాంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వెల్‌కమ్ పార్టీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ స్థాయి నుంచే విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు.
సోమవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల వెల్‌కమ్ పార్టీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కళాశాల జీవితం చదువుతో పాటు మంచి స్నేహాలు, మంచి ఆలోచనలు, విలువలను నేర్చుకునే సమయమని అన్నారు.
కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో మెలగాలని సూచించారు. ఇప్పటి నుంచే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కష్టపడాలని, విజయానికి డబ్బు కంటే లక్ష్యం, అదృష్టం కంటే పట్టుదల ముఖ్యమని పేర్కొన్నారు. మార్కులతో పాటు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, గురువులు, తల్లిదండ్రులను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియా, రీల్స్‌తో సమయాన్ని వృథా చేయకుండా భవిష్యత్తు నిర్మాణానికి వినియోగించుకోవాలని హితవు పలికారు.
రీల్స్ చూస్తూ సమయం గడపడం కాదు.. మీ జీవితాన్ని రియల్‌గా మార్చుకోవాలి అని అన్నారు. సమయపాలనను అలవర్చుకుని ప్రతిరోజూ తమ లక్ష్యం కోసం కొంత సమయం కేటాయించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయర్, కౌన్సిలర్లు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44463/