schedule Thursday, September 03, 2026

పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం..!

calendar_today August 31, 2026
person dharshininews
పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం..!
పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం..! - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి - 8వ వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎస్డీఎఫ్‌ నిధులు రూ. 25లక్షలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలోని వార్డులో రోడ్ల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని సూచించారు. మిగిలిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్, కమిషనర్‌ రాకేష్‌ రెడ్డి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44458/