రాములోరి సేవలో..
August 27, 2026
dharshininews
రాములోరి సేవలో..
- మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల దంపతుల చేయూత
- దేవాలయ పునర్నిర్మాణానికి రూ.1.11 లక్షల విరాళం
- కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాములోరి సేవలో భాగంగా తాండూరు పట్టణం ఇంద్రనగర్‌లోని ఏకైక రామ మందిరం పునర్నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు చేయూత అందించారు.
దైవభక్తితో తమ వంతుగా రూ.1.11 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ల దంపతులు మాట్లాడుతూ.. రామ మందిరం పునర్నిర్మాణానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా భక్తులు, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
విరాళం అందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మండపంతో పాటు మరికొన్ని పనులు ఇంకా పూర్తిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. భక్తులు, దాతలు తమ వంతు సహకారం అందించి రామ మందిరం అభివృద్ధికి తోడ్పడాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
https://www.dharshininews.com/44387/